ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకున్న వైసీపీ

స్వార్థ రాజకీయ శక్తుల కుట్రలు, కుతంత్రాలను ఛేదించుకుంటూ, ప్రజా సంక్షేమమే ఊపిరిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి ఎనిమిది వసంతాలు పూర్తిచేసుకొని నేడు తొమ్మిదవ వసంతంలోకి అడుగుపెట్టింది.

రుణ మాఫీ పై తొలి సంతకం

యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌(వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌) పార్టీగా ఆవిర్భవించి అధికారపార్టీ నుంచి ఎదువుతున్న అనేక ఇబ్బందులను, కష్టనష్టాలను ఓర్చుకుంటూ జనం సమస్యలపై నిత్యం పోరాటాలు చేస్తూ అనేక సమస్యల నుంచి ప్రజలను కాపాడగలిగారు.

ఈ క్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు సిద్ధపడుతున్నారు. తన తండ్రి మహానేత వైఎస్‌ రాజశేఖరెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు వదిలినవారి కుటుం బాలను ఓదార్చడానికి కాంగ్రెస్‌ అధిష్టానం అడ్డుతగిలితే, ఆ పార్టీని వదిలి బయటకు వచ్చి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పార్టీని స్థాపించారు.

ప్రత్యేక హోదా సాధన డిమాండ్‌ను భుజానికెత్తుకుని ఉవ్వెత్తున నినదించారు.జిల్లాలో పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో పార్టీ శ్రేణులు ఏకతాటిపై నడిచారు. తమ అధినేతను ఆదర్శంగా తీసుకుని నవరన్నాలు, రావాలి జగన్, కావాలి జగన్‌ కార్యక్రమాలు చేపట్టి, పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నారు.

ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తోమిడవ వసంతంలోకి అడుపెట్టిన సందర్భంగా వైఎస్. జగన్ ట్విట్టర్ వేదికగా ప్రతీ కుటుంబానికి శుభాకాంక్షలు తెలియ చేశారు.