టీడీపీ అఖిలపక్ష సమావేశం పై ధ్వజమెత్తిన వైసీపీ

ఇటీవ‌ల‌ రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయం పై చ‌ర్చించ‌డానికి రాజ‌కీయ‌పార్టీల‌తో అఖిలప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

అభ్యర్థుల ప్రకటనలో జనసేన

అయితే తాజాగా టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా ప్ర‌త్యేక‌హోదా కోసం అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేయ‌నున్నారు.

టీడీపీ పిలుపునిచ్చిన అఖిలప‌క్షం దాదాపు ఏక‌ప‌క్షం అని తేలిపోవడంతో స‌మావేశానికి వ‌చ్చేదే లేద‌ని జ‌న‌సేన ఇప్పటికే ఒక బ‌హిరంగ‌లేఖ‌ను విడుద‌ల చేసింది.

అలాగే కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర విభ‌జ‌న దోషులు కావ‌డంతో ముందే రామ‌ని తేల్చేశాయి.తాజాగా ఇప్పుడు వైసీపీ కూడా టీడీపీ పై ఫైర్ అయ్యింది.

ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ద‌క్క‌క‌పోవ‌డానికి ముఖ్య కార‌ణం టీడీపీనే అని నాలుగేళ్ళు బీజేపీతో కాపురం చేసి, ప్ర‌త్యేక‌హోదా అన్న‌వారిని జైల్లో పెడ‌తామ‌ని బెదిరించి, ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతుండంతో  డ్రామాలు ఆడుతున్నార‌ని, ఇలాంటి దిక్కుమాలిన రాజ‌కీయాలు చేసేవారికి వైసీపీ స‌పోర్ట్ ఉండ‌ద‌ని వైసీపీ విరుచుకుప‌డింది.

ఇది ఇలా ఉండగా ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌డంతో అధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాజకీయాలు మాములుగా లేవని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.