ఏడు చేపల కథ’ తెలుగు మూవీ రివ్యూ

edu chepala katha

 

“ఏడు చేపల కథ” మూవీ రివ్యూ అండ్ రేటింగ్ :2/5.0

  విడుదల తేదీ : నవంబర్ 1st , 2019

టైటిల్ : ఏడు చేపల కథ
తారాగణం :అభిషేక్ రెడ్డి,భాను శ్రీ, అయేషా సింగ్
దర్శకత్వం : ఎస్ జె చైతన్య
మ్యూజిక్ డైరెక్టర్: కవి శంకర్
నిర్మాత : GVN శేఖర్ రెడ్డి

కథ:

‘ఏడు చేపల కథ’..గుర్తుండే ఉండి ఉంటుంది, A సర్టిఫికేట్ సినిమాకి ఎక్కువ. ఫోర్న్ సినిమా కి తక్కువలా ఉందే అని టీజర్, ట్రైలర్, పోస్టర్స్ చూసి నోటిపై వేలేసుకున్నవాళ్లు చాలా మందే ఉన్నారు. పక్కా బూతు కంటెంట్‌తో నగ్న సన్నివేశాలతో ‘ఏడు చేపల కథ’ చిత్రాన్ని ప్రమోట్ చేసుకుని ఈ రోజు నవంబర్ 7 న థియేటర్స్‌కి తీసుకువచ్చారు. మరి ఈ ‘ఏడు చేపల కథ’ నిజం గా బూతా సినిమా నా? అనేది ఒకసారి తెలుసుకుందాం.

నటీనటులు:

టెంప్ట్ రవి (అభిషేక్ రెడ్డి)కి థలసేమియా వ్యాధి. ముప్పై రోజులకోసారి రక్తం ఎక్కించుకోకపోతే చనిపోతాడు. పేరు కి తగినట్లే అతని ముందు ఎవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే అస్సలు తట్టుకోలేడు. అనాధ అయిన టెంప్ట్ రవికి రాధ (భాను శ్రీ) ఫ్రెండ్ ,ఇద్దరు ఒకే రూమ్ లో వుంటారు . వీరిద్దరికీ మరో ఇద్దరు స్నేహితులు వుంటారు . వీరంతా కూడా థలసేమియా వ్యాధి బాధితులే కావడంతో సెల్ ఫోన్ దొంగతనాలు చేసి రక్తం ఎక్కుంచుకునేందుకు కష్టంపడుతుంటారు. అయితే బ్యాచ్‌లో టెంప్ట్ రవి మాత్రం కష్టపడి పని చేస్తూ ఉంటాడు .

సెల్ మెకానిక్‌గా పనిచేసే భావన (అయేషా సింగ్) టెంప్ట్ రవికి బ్లడ్ డొనేట్ చేసి సాయం చేస్తుంది. తను ఎవరో తెలియకుండానే సాయం చేసిన భావనను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు టెంప్ట్ రవి. అయితే భావన ఆమెకు తెలియకుండా ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరో తెలియకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంది.అయితే ఆమె ఆత్మహత్య చేసుకునే టైం లో సుందర్ అనే వ్యక్తి కాపాడతాడు. ‘చనిపోయి సాధించేది ఏం లేదు’ అని ఆమెకు చెప్పి.. నిన్ను ప్రెగ్నెంట్ చేసిన వ్యాక్తిని నేను కనిపెడతా. అందుకు ప్రతిఫలంగా నువ్ ఒక సాయం చేయాలని.. సుందర్ ప్రేమించిన అమ్మాయి మీరా ఆత్మను భావన శరీరంలోకి ప్రవేశపెడతాడు.

అదే సందర్భంలో టెంప్ట్ రవితో పాటు అనాధగా పెరిగిన అమ్ములు రవిని ఇష్టపడుతుంది. అతనిపై ప్రేమను పెంచుకున్న అమ్ములు రవితో టెంప్ట్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. దాన్ని తిరస్కరించడంతో అమ్ములు సూసైడ్ చేసుకుని చనిపోతుంది.అయితే టెంప్ట్ రవి ఎవర్నైతే చూసి టెంప్ట్ అవుతాడో.. వాళ్లంతా రాత్రి పూట రవి కలలోకి వస్తారు. కలకు నిజానికి తేటా తెలియని రవి ఆ ఏడుగురితో సెక్స్ చేస్తాడు. ఇలా రవి కలలోకి వచ్చిన రేప్ చేసిన ఏడుగురు అమ్మాయిల కథే ఈ ‘ఏడు చేపలు’. ఇంతకీ ఈ ఏడు చేపలు ఎవరు? రవిని ఎందుకు రేప్ చేస్తారు? అమ్ములు ఎవరు? భావనను ప్రెగ్నెంట్ చేసింది ఎవరు? రవి కోసం రాధ చివరికి ఏం చేసింది? అన్నదే ఏడు చేపల్లోని మిగతా కథ.

విశ్లేషణ:

టీజర్స్‌లో ఏడు చేపలుగా ఏడుగురు అమ్మాయిల్ని చూపించి వాళ్లతో అందాలను ఆరబోయించారు. లిప్ లాక్‌లతో రెచ్చపోయేలా చేశారు… ఇక బెడ్ రూం సీన్లును సైతం కెమెరాతో రకరకాల యాంగిల్స్‌లో చూపించారు. అంతటితో ఆగకుండా.. ఒకరి కి మల్లెపూలు పెట్టి మగాడిపై ఎగబడి రేప్ చేసే సీన్లతో ఈ సినిమా పోర్న్ సినిమాకు ఏమాత్రం తీసిపోదనే భ్రమ కల్పించారు.
‘సెన్సార్ ఆఫీసర్ రాజశేఖర్ ఐఏఎస్ సినిమా చూసిన తరవాత ఒణికిపోయారు. సెన్సార్ ఆఫీసులో ముగ్గురు లేడీస్ ఉన్నారు. వాళ్లకు ఈ సినిమా చూపించాడు. బ్లర్‌లు కూడా లేకుండా అలాగే వేసి చూపించాడు. వాళ్లు సిగ్గుతో తలపై చెంగులు కప్పుకున్నారు’.. అని ప్రమోషన్స్‌లో భాగంగా టెంప్ట్ రవి చెప్పింది నిజమే అయినా.. సెన్సార్ వాళ్లు చేయాల్సింది సైలెంట్‌గా చేసేశారు. ఎక్కడికక్కడ కత్తెరేసి పడేశారు.కామంతో టీజర్‌, ట్రైలర్‌లలో తహ తహలాడిపోయే టెంప్ట్ రవి.. ఈ సినిమాలో చాలా ఇన్నోసెంట్‌గా కనిపించారు. అడల్ట్ కామెడీ చిత్రంలో కూడా తన మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ పండించాడు.
చివరగా ‘ఏడు చేపలు కథ’ టీజర్, ట్రైలర్‌లను చూసి సినిమాలో ఏదో ఉంటుందని ఊహించుకుని సినిమాకి వెళ్తే నిరాశే. ‘ఏడు చేపలు’ గురించి కాకుండా కాసేపు టెంప్ట్ రవి ని చూడటానికి వెళ్లొచ్చు .