చిన్నాన్న‌ను అత్యంత దారుణంగా హ‌త్య చేశారు : వైఎస్ జ‌గ‌న్

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో షాకింగ్ అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. స‌హ‌జ మ‌ర‌ణం నుండి హ‌త్యగా మారిన వివేకానంద‌రెడ్డి కేసులో నమ్మ‌లేని నిజాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.ఇవాళ పులివెందుల‌లో ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి త‌న చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి మృత‌దేహానికి నివాళులు అర్పించారు.

మా నాన్నది హత్యే వైఎస్‌ సునీత ఫిర్యాదు

శుక్రవారం వైఎస్‌ జగన్‌ పులివెందులలో మీడియాతో మాట్లాడుతూ.. హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం పకడ్బందీగా జరుగుతోందని, హత్య వెనక ఎవరున్నా బయటకు తీయాలని అన్నారు. 35 ఏళ్ల రాజకీయ చరిత్ర కలిగిన మాజీ ఎంపీని ఇంట్లోకి చొరబడి అతి కిరాతంగా గొడ్డలితో నరికి చంపడమనేది అత్యంత దారుణం, నీచమైన చర్య అని ఆయన వ్యాఖ్యానించారు.

త‌మ చిన్నాన్న‌ను ఒక ప్లాన్ ప్ర‌కార‌మే హ‌త్య చేసి దానిని యాక్సిడెంట‌ల్ డెత్‌గా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశార‌ని జ‌గ‌న్ అన్నారు.వివేకానంద‌రెడ్డి మృతి విష‌యంలో వైఎస్ అభిమానులంతా సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. మా కుటుంబంపై జరిగిన అన్ని దాడుల్లో చంద్రబాబు పాత్ర, కుట్ర ఉంది. వాళ్లే హత్య చేసి వాళ్లే సిట్‌ వేస్తే ఎలా?. సీబీఐ విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందని జ‌గ‌న్ అన్నారు.

Advertisement