పిడుగురాళ్ల నుంచి వైఎస్‌ జగన్‌ తొలి ప్రచార సభ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ నిర్విరామంగా “ప్రజా సంకల్ప యాత్ర” పేరిట 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన సంగతి తెలిసినదే.

టీడీపీ పై జగన్ సంచలన వాఖ్యలు

ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తరుణంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 16 నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు తలశిల రఘరాం స్పష్టం చేశారు.

బుధవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 16వ తేదీ ఉదయం ఇడుపులపాయలో దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం వైఎస్‌ జగన్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నారని పేర్కొన్నారు.

వైఎస్‌ జగన్‌తోపాటు వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, ఆయన సోదరి వైఎస్‌ షర్మిల కూడా పార్టీ తరఫున ప్రచారం చేస్తారని వెల్లడించారు.