జగన్ కి కోపం తెప్పిస్తే ఇలానే ఉంటదా?

YS Jagan Firesతాజాగా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడుతూ,తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ఎన్నిక‌ల్లో జోక్యం చేసుకుంటున్నార‌ని, 1000 కోట్ల రూపాయలు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అందించార‌ని ఆరోపించారు.

అసహనంలో బాబు., మరీ ఇంతలానా?

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్ చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై స్పందించారు. భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్‌ లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్-యాక్టర్‌లు ఐదేళ్లలో కేసీఆర్‌ ను ఎన్నిసార్లు పొగిడారో గుర్తు చేసుకోవాలని జ‌గ‌న్ అన్నారు. చంద్రబాబును అడుగుతున్నా, కేసీఆర్‌ వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చారని అంటున్నారే, వెయ్యి కోట్లు ఇస్తుండగా నువ్వు చూశావా? లేదా కేసీఆర్‌ నీకు ఫోన్‌ చేసి చెప్పాడా? అని అడిగారు.

సిగ్గులేకుండా కనీసం నీ వయస్సుకు కూడా గౌరవం లేకుండా, నిసిగ్గుగా అబద్ధాలు ఆడడం నీకే చెల్లుబాటు అవుతుంది బాబూ అంటూ జగన్ దుమ్మెత్తిపోశారు.

ప్రత్యేక హోదా కోసం మన రాష్ట్రంలో 25 మంది ఎమ్మెల్యేలకు తోడు తెలంగాణ ఎంపీలు కూడా మద్దతు ఇస్తామంటే దానికి హర్షించాల్సింది పోయి దిక్కుమాలిన రాజకీయాలు మాట్లాడుతావా? అని ఆయన బాబును ప్రశ్నించారు.