ఆరు నెలల తరువాత జగన్ గ్రాఫ్ చూశారా?

YS Jagan Graf in Fibruaryఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి.దీంతో ఎవరి గ్రాఫ్ ఎలా ఉందని జాతీయ మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తున్నాయి.తాజాగా ఇండియా టుడే సర్వే తమ సర్వే వివరాలను వెల్లడించింది.

ఏబీఎన్ రాధాకృష్ణకు చెక్ పెట్టిన జగన్!

ఆరు నెలల కిందట వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ ని పరిశీలిస్తే 43% ఉండగా,ఫిబ్రవరి నాటికి ఆయన గ్రాఫ్ 45% కి పెరిగింది.అలాగే అధికారపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ని పరిశీలిస్తే ఆరు నెలల క్రితం 38% ఉండగా,ఫిబ్రవరి నాటికి 36% కి తగ్గింది.

ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ గతంలో 5% ఉండగా,ఇప్పుడు ఆయన గ్రాఫ్ 4% కి వచ్చింది.ఇతరులకు 15% మద్దతు ఉందని ఈ సర్వేలో వెల్లడైంది.

గత ఎన్నికలలో జగన్ స్వల్ప తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.ఈసారి అన్ని సర్వేలు జగన్ కే మద్దతు తెలుపుతున్నాయి.ఇక రానున్న ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.

Advertisement