తొలిసారి తెర పై వైఎస్ జగన్

మాజీ ముఖ్య మంత్రి దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’.

విలనిజం చూపించబోతున్న స్టార్ హీరోయిన్

మహి వీ రాఘవ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి , ఆయన తండ్రి పాత్రలో జగపతి బాబు , ఆయన సోదరుడి పాత్రలో రావు రమేష్ లు నటిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా అసలు జగన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది అందరికి ఆసక్తిగా మారింది.ఈ పాత్ర పై నిన్నటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఈ పాత్ర పై ఓ క్లారిటీ వచ్చింది.

ఈ చిత్రం లో జగన్ పాత్ర లో వైఎస్‌ జగనే తొలిసారి తెర పై నటించనున్నారని చిత్ర యూనిట్ వెల్లడించింది.

అయితే చిన్న పాత్రలో కొన్ని షాట్లలో మాత్రమే వైఎస్‌ జగన్ కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్‌, ట్రైలర్‌లతో ఆకట్టుకున్నారు.

శివా మేక సమర్పణలో 70 ఎమ్ఎమ్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై విజయ్‌ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement