వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో నూతన పథకం ” వైఎస్సార్ నేతన్న నేస్తం “

తెలుగు చేనేత కార్మికులను ఆదుకునేందుకు మరో నూతన పథకాన్ని అమలు చేయబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం ప్రకటించింది.ఈ రోజు ముఖ్యమంతి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ క్యాబినెట్ సమావేశం లో నిర్ణయం తీసుకున్నారు.కాబినెట్ నిర్ణయాలను పేర్ని నాని మీడియా కు తెలియచేసారు.
డిసెంబర్ 21న “” వైఎస్సార్ నేతన్న నేస్తం ” పథకం ను ప్రారంభించబోతున్నట్లు ప్రకటించింది ,ఈ పథకం ద్వారా ఒక్కోచేనేత కార్మికుడి కుటుంబానికి సంవత్సరం కి రూ. 24 వేలు ఆర్థిక సహాయం చేయనున్నట్లు వెల్లడించింది .

నవంబర్ 21న మత్యకారుల దినోత్సవం సందర్భం గా మత్యకారులకు వేట నిషేధ సమయం లో రూ . 10 వేలు ఆర్థికసాయం అందచేయాలని ప్రభుత్యం నిర్ణయించింది,అలాగే మత్యకారుల బోట్లకు లీటర్ డీజిల్ కు రూ .9 సబ్సిడీ ఇస్తున్నట్లు ,ఈ సబ్సిడీ మత్యకారులు డీజిల్ పోయించుకున్నప్పుడే వర్తిస్తుంది అని వివరించారు .

డిసెంబర్ 3న జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భం గా న్యాయవాదులకు రూ . 5 వేలు ప్రోత్సాహం అందించాలి అని ప్రకటించింది .రాష్ట్రము లో ని హోంగార్డ్ ల రోజువారీ వేతనాన్ని రూ. 600 నుండి రూ. 710 పెంచింది .దీంతో హోంగార్డ్ ల వేతనం నెల కి రూ. 18 వేలు నుండి రూ. 21300 కు పెరిగింది .అలాగే పలాస లోని 200 పడకల ఆసుపత్రి లో ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగుల ను గుర్తించి ప్రభుత్యం హామీ గా వుండి రవాణా వాహనాలను అందించాలి అని నిర్ణయం తీసుకుంది .అదేవిదం గా ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాల కోసం కార్పొరేషన్ ఏర్పాటుకు ,జిల్లాలు వారీగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఏపీ కాబినెట్ ఆమోదం తెలిపింది అని మీడియా ద్వారా పేర్ని నాని ప్రకటించారు .