” వైఎస్సార్ నవోదయం ” పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి

గురువారం సచివాలయం లో ముఖ్యమంతి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి “వైఎస్సార్ నవోదయం” పథకాన్ని ప్రారంభించారు.ఈ పథకం ద్వారా సూక్ష్మ ,చిన్న మధ్య తరహా పరిశ్రమల కు సహాయం లభిస్తుంది .కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలను కలిపించే ఈ పరిశ్రమలకు “వైఎస్సార్ నవోదయం” పథకం ఎంతగానో సహాయ పడుతుంది. ఈ కార్యక్రమం లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఉన్నతాధికారులు పాల్గున్నారు.

ఇళ్ల స్థలాల పంపిణి విషయంపై కూడా ముఖ్యమంతి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు .ఈ సమీక్ష సమావేశం లో అధికారులకు కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు.సీఎం క్యాంపు కార్యాలయం లోని ఈ సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్ బుగ్గన రాజేంద్రనాధ్ ,బొత్సా సత్యనారాయణ ,పిల్లి సుభాష్ చంద్రబోష్ మరియు ఉన్నతాధికారులు పాల్గున్నారు.