అమిత్ షాతో ఎపి సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ !!!

ap cm ys jagan mohan reddy meeting with amit shah
ap cm ys jagan mohan reddy meeting with amit shah

ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రితో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశం సుమారు 40 నిమిషాల పాటు కొనసాగింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను సీఎం వైయస్‌ జగన్‌ అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. విభజన హామీలపై చర్చించారు.
విద్యుత్ కొనుగోలు ఒప్పందం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. అలాగే పెండింగ్ నిధులు, సమస్యలతో పాటూ మరికొన్ని కీలక అంశాల గురించి విన్నవించారు. అమిత్ షా పుట్టిన రోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, నందిగం సురేష్, రఘురామకృష్ణరాజు, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.
మధ్యాహ్నం కేంద్ర న్యాయ, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో జగన్ భేటీకానున్నారు. అనంతరం కేంద్ర బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతోనూ సమావేశం అవుతారు. కేంద్రమంత్రులతో భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, సమస్యలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి తిరిగి ఢిల్లీ నుంచి అమరావతికి చేరుకోనున్నారు.