రాటుతేలిన జగన్ రాజకీయం.. యుద్దానికి సిద్ధమా?

YS jagan Politicsసమరానికి సిధ్ధపడినపుడు అన్ని వైపుల నుంచి దూసుకువస్తున్న కత్తులకు ఒకే మారు జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఏమరుపాటుకు గురి అయితే భారీ మూల్యమే చెల్లించాల్సిఉంటుంది.

రేపటి నుండి జనం బాట పడుతున్న జగన్!

అసలు యుధ్ధం బాబుతో కాదు ఎల్లో మీడియాతో. ఈ సంగతి ఇప్పుడు జగన్ కి బాగా తెలిసింది.2014 ఎన్నికలో జగన్ని బదనాం చేసింది. ఇప్పటికీ చేస్తున్నది ఆ మీడియాలే.

నిజానికి లేని బలాన్ని చూపించి, ఉన్న బలాన్ని తగ్గించి,నాటి నుంచి నేటి వరకూ కొత్త వ్యూహాలతో విస్తరిస్తోంది తప్ప ఏ మాత్రం తగ్గని, ఓడని మీడియా అది.

తిరుపతి సమర శంఖారావ సభలో జగన్ మాటలు రాటుతేలిన ఆయన రాజకీయాన్ని తెలియచేశాయి. ఒకటికి పదిసార్లు దెబ్బ తిన్న ఆయన క్యాడర్ కి దిశానిర్దేశం చేస్తున్న తీరు అదే చెబుతోంది.

మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు ఎల్లో మీడియాతో కూడా, ఉన్నది లేనట్లుగా – లేనిది ఉన్నట్లుగా చూపిస్తుంది, తస్మాత్ జాగ్రత్త అని జగన్ అన్న మాటలు అక్షర సత్యాలే.యుద్ధం చేయాలనుకున్నపుడు అన్ని తంత్రాలు దగ్గర పెట్టుకోవాలని జగన్ చెప్పుకొచ్చాడు.

Advertisement