వైఎస్‌ జగన్‌ హామీ పై సర్వత్రా హర్షం

‘బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. భారతదేశ కల్చర్‌’ అని అభివర్ణించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి .. బీసీల అభివృద్ధికి ప్రతిఏటా రూ.15వేల కోట్ల చొప్పున..ఐదేళ్లలో రూ.75వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ ఇచ్చి సంచలనం సృష్టించారు.

ఏపీ పాలిటిక్స్ :1100 మంది వైసీపీలో చేరిక

మాట తప్పని జగన్‌ అధికారంలోకి వస్తే.. తమ ఆశలు నెరవేరుతాయని బీసీలు అభిప్రాయపడుతున్నారు. బీసీల్లో ఆర్థిక విప్లవం జగన్‌తోనే సాధ్యం అంటున్నారు.

బీసీల వృత్తులకు మరింత ఆర్ధిక ఊతం ఇవ్వడంతోపాటు బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనారిటీ విద్యార్ధుల ఉన్నత చదువులకు కొండంత అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎంతపెద్ద చదువులైనా ఉచితంగా చదివిస్తానని జగన్‌ ప్రకటించారు.

45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతీ అక్కాచెల్లెమ్మలకు నాలుగు విడతల్లో ఆయా కార్పొరేషన్ల ద్వారా రూ.75వేలు ఇస్తారు.గ్రామ వలంటీర్‌ ద్వారా నేరుగా ఇంటికి తీసువెళ్లి అక్కా చెల్లెమ్మల చేతుల్లో రూ.75వేలు పెడతారు.వైఎస్‌ జగన్‌ పేర్కొన్న అంశాలపై ఆ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.