పులివెందులలో ఎగసిన జనకెరటం

ఎన్నికల ప్రచారంలో భాగంగా పులివెందులలో స్థానిక సీఎస్‌ఐ చర్చి మైదానంలో జరిగిన బహిరంగ సభలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తూ…‘నాన్నకు, నాకు పులివెందుల అంటే అమితమైన ప్రేమ. కడప గడ్డపై పుట్టినందుకు గర్వపడుతున్నా.. పులివెందుల గడ్డపై పుట్టినందుకు ఇంకా గర్వపడుతున్నా. ఇక్కడి ప్రజల మంచితనాన్ని ఎప్పటికీ మర్చిపోలేను.

మా నాన్నది హత్యే వైఎస్‌ సునీత ఫిర్యాదు

కష్టాల్లో కూడా ఎలా ధైర్యంగా ఉండాలో నేర్పించింది ఈ గడ్డ. నాకు సహనాన్ని కూడా నేర్పించింది ఈ గడ్డే. కుట్రలు, కుతంత్రాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది ఈ పులివెందుల గడ్డనే.రాతి గడ్డలో ఎలా సేద్యం చేయాలో నేర్పించింది ఈ గడ్డ. మాట కోసం ఎంతటి కష్టాన్నైనా ఓర్చుకోవడం ఈ గడ్డ బిడ్డలుగా మనందరికీ తెలుసు’ అని ఉద్వేగానికి లోనయ్యారు.

 రైతులు పడుతున్న బాధలన్నీ చూశాం.. అక్కా చెల్లమ్మలు పడుతున్న ఆగచాట్లను చూశాం. వారి బాధలను చెప్తుంటే విన్నాం. పసుపు కుంకుమతో చంద్రబాబు చేస్తున్న మోసాలను మనమంతా చూశాం. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ పూర్తవుతుంది.. ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూసిన యువకులను చూశాం. మీ బాధలను నేను విన్నాను. మీ అందరికి అండగా నేనున్నాను.

 ఎన్ని కుట్రలు పన్నినా వచ్చేది మాత్రం మనందరి ప్రభుత్వమేనని చెబుతున్నా. నవరత్నాలతో ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికి చెప్పాలి, అని వైఎస్‌ జగన్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.