టీడీపీ-జనసేన ముసుగు పొత్తు

ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబు, ఆయన పాట్నర్‌ యాక్టర్‌ (పవన్‌ కళ్యాణ్‌) కలిసి ప్రజలను మోసం చేస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు.

వివేకానందరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా చిలకలూరి పేట బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడదల రజినీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ… ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నందున టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తన పార్టీకి కూడాడిపాజిట్లు రావని తెలిసి టీడీపీ-జనసేన విడివిడిగా పోటీ చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఐదేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

టీడీపీ పాలనలో మహిళలకు కన్నీళ్లు తప్ప మరేమీ మిగలలేదని, మహిళలకు కనీసం రక్షణ కూడా కరువైందని అన్నారు. డ్వాక్రా మహిళలను నిలువునా మోసం చేసిన చంద్రబాబు ఎన్నికల వేళ పసుపు కుంకుమ పేరుతో మరోసారి మోసానికి దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు.