మా నాన్నది హత్యే వైఎస్‌ సునీత ఫిర్యాదు

 దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.అయితే జరిగిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో ఆయన శరీరంపై ఏడు కత్తి గాయాలు ఉన్నాయని వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు.

వైఎస్‌ కుటుంబంలో విషాదం వివేకానందరెడ్డి కన్నుమూత

పదునైన ఆయుధంతో వైఎస్‌ వివేకానందరెడ్డి తల, శరీరంపై ఏడుసార్లు దాడి చేసినట్లు గుర్తించారు.
నుదుటిపై లోతైన రెండు గాయాలు, తల వెనక భాగంలో మరో గాయం, తొడ భాగం, చేతిపైనా మరో గాయం అయినట్లు తెలుస్తోంది.

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్యపై ఆయన కుమార్తె వైఎస్‌ సునీత పోలీసులకు ఫిర్యాదు చేశారు.సోదరుడు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డితో కలిసి పులివెందుల పీఎస్‌కు వచ్చిన ఆమె… తన తండ్రి హత్యపై లోతుగా విచారణ జరిపించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు తరువాత మీడియాతో వైఎస్‌ సునీత మాట్లాడుతూ మా నాన్న రాజకీయాల్లో పాలుగొంటారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఆయన ప్రచారం చేస్తున్నారని,ప్రచారాన్ని అడ్డుకునేందుకే ప్రత్యర్థులు కుట్ర పన్ని ఆయనను హత్య చేశారని అనుమానిస్తున్నాం అని పేర్కొన్నారు.

Advertisement