వైయస్ వివేకానందరెడ్డి మృతిపై అనుమానాలు!

YS Vivekanandareddyవైఎస్ కుటుంబానికి ఎందుకనో తెలియని దురదృష్టం వెంటాడుతున్నట్లుంది.ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులలో వెఎస్సార్ చనిపోయారు. దాదాపు పదేళ్లయినా ఆయన మరణం చుట్టూ ఉన్న అనుమానాలు తీరలేదు.

బాబుకు అర్థమయిపోయిందా?

ఈ రోజు తెల్లవారు జామున వైయస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించారని అందరూ అనుకుంటున్నారు. అయితే అది గుండెపోటు కాదని అనుమానాస్పద మృతి అని వివేకా పిఏ కృష్ణారెడ్డి అంటున్నారు.

బాత్ రూమ్ లో వివేకానందరెడ్డి రక్తపు మడుగులో పడివుండటమే, తన అనుమానానికి కారణంగా పిఏ చెబుతున్నారు. వివేకా తల, చేతులపై బలమైన గాయాలున్నాయంటూ పిఏ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాత్రి నుండి ఉదయం వరకూ వివేకానందరెడ్డి ఇంట్లో ఏం జరిగిందనేది ఇపుడు మిస్టరీగా మారింది. పిఏ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. పోస్టుమార్టమ్ చేసిన తర్వాత అసలు విషయాలు బయటకు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు.

Advertisement